Bank Holidays March: మార్చి 17 - 29 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు
2022 మార్చి 17 - 29 మధ్యన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడు రోజులు సెలవులు వచ్చాయి. కస్టమర్లకు బ్యాంకుల్లో పనులుంటే సెలవులను చూసుకొని ప్లాన్ చేసుకోండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం మార్చి 17-29 మధ్యన ఐదు రోజులు మాత్రమే సెలవులు. కానీ ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో మరో రెండు రోజులు బ్యాంకులు మూత పడతాయి.
సెలవు రోజుల్లోనూ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ సేవలు కస్లమర్లకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసేసినప్పటికీ కొన్ని సెలవు దినాల్లో ప్రైవేటు బ్యాంకులు పనిచేయనున్నాయి.
మార్చి 17 హోలీ దహనం, మార్చి 18న హోలీ, 20న ఆదివారం, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం ఉన్నాయి. మార్చి 28, 29న బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
బ్యాంకులను ప్రైవేటీకరించడం మానుకోవాలని ట్రేడ్ యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ లాస్ అమెండమెంట్ బిల్-2021ను విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాయి. తమ డిమాండ్లను తీర్చేవరకు సమ్మె కొనసాగుతుందని యూనియన్లు స్పష్టం చేస్తున్నాయి.