Dmart Shares: ఆదాయం పెరిగినా..! 'డీమార్ట్' షేర్లకు సీటీ నహీ మార్!
అవెన్యూ సూపర్ మార్కెట్స్ రిజల్ట్స్ చూస్తే మెరుగ్గానే ఉన్నాయి. స్టాండలోన్ ప్రాతిపాదికన ఆపరేషన్స్ రెవెన్యూ రూ.10,337 కోట్లుగా నమోదైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏడాది క్రితం ఇదే టైమ్‌లోని రూ.8606 కోట్లతో పోలిస్తే 20 శాతం గ్రోత్ కనిపిస్తోంది. ఇక 2021 మార్చి 31న రూ.7303 కోట్లు, 2020 మార్చి 31న రూ.6193 కోట్ల ఆదాయాన్ని కంపెనీ ప్రకటించింది.
అయితే బ్రోకరేజీ కంపెనీ 'సిటీ' మాత్రం సెల్ రేటింగ్ ఇస్తోంది. రూ.3460 టార్గెట్‌గా ఇచ్చింది.
మూడేళ్ల సీఏజీఆర్ ప్రకారం ఒక స్టోర్ యావరేజి రెవెన్యూ +2.3 పర్సెంట్‌గా ఉంది. ఇదే లెక్కన ఒక స్క్వేర్ ఫీట్‌కు సగటు ఆదాయం మైనస్ 3 పర్సెంట్‌గా ఉందని తెలిపింది. ప్రస్తుత వాల్యూయేషన్ వద్ద ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ప్రస్తుత అవెన్యూ సూపర్ మార్కెట్‌కు దేశ వ్యాప్తంగా 324 స్టోర్లు ఉన్నాయి. ఇక మోర్గాన్ స్టాన్లీ మాత్రం డీమార్ట్ షేర్లకు ఈక్వల్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్‌ను రూ.3853గా తెలిపింది. నాలుగేళ్ల సీఏజీఆర్ ప్రకారం రెవెన్యూ 19.7 శాతం పెరిగిందని చెప్పింది.
కాగా అవెన్యూ షేర్లు గతేడాది సెప్టెంబర్ 2న రూ.4,606 వద్ద 52 వీక్ హైను టచ్ చేశాయి. అంతకు ముందు మే 16న రూ.3185 వద్ద 52 వీక్ లోను తాకాయి. ఏడాదిన్నరగా ఈ షేర్లు డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి. ప్రస్తుత లెవల్స్‌లో డీ మార్ట్ షేర్లకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.