LTI Mindtree Dividend: బంపర్ ఆఫర్! ఒక్క షేరుకు 4000% డివిడెండ్!
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఏప్రిల్ 27న నాలుగో త్రైమాసికం రిజల్ట్స్‌ను విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 0.5 శాతం పెరిగి రూ.1114 కోట్లకు చేరుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 11.3 శాతం ఇంప్రూవ్ అయింది. రిజల్ట్స్‌తో పాటే డివిడెండ్ న్యూస్ చెప్పింది. అయితే ఇందుకు రికార్డు డేట్ ఇంకా నిర్ణయించలేదు.
కంపెనీ ఏజీఎం అవ్వగానే షేర్ హోల్డర్లకు డివిడెండ్ బదిలీ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పింది. కాగా 2023, జనవరి 31న కంపెనీ చివరి సారిగా డివిడెండ్ ఇచ్చింది. అప్పుడు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.20 బదిలీ చేసింది.
ప్రస్తుతం ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు రూ.4,400 లెవల్స్‌లో ట్రేడవుతున్నాయి. చివరి ఏడాదిలో 12 శాతం వరకు నష్టపోయాయి. రూ.5000 నుంచి రూ.4400కు పడిపోయింది. చివరి ఐదు రోజుల్లోనే షేర్లు ఐదు శాతం మేర లాభపడ్డాయి.
గ్లోబల్ ఎకానమీ స్లోడౌన్.. నార్త్ అమెరికా, యూరోప్ మార్కెట్లలో మార్జిన్లు తగ్గిపోవడంతో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది.
ఎల్‌టీఐ మైండ్‌ట్రీకీ ఇది తప్పలేదు. నార్త్ అమెరికాలో ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉన్న ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఎంఫాసిస్.. కమ్యూనికేషన్ వెర్టికల్‌లోని టెక్ మహీంద్రా వంటి కంపెనీలపై నియర్ టర్మ్‌లో ప్రెజర్ ఉంటుందని అనలిస్టులు చెప్తున్నారు.