Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Domino's About Zomato Swiggy: పిజ్జా ప్రియులూ - స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నారా! మీకో షాకింగ్ న్యూస్!
మీరు డామినోస్ పిజ్జా ప్రియులా! నోరూరినప్పుడల్లా జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించుకుంటారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్! త్వరలోనే ఆ రెండు యాప్లతో డామినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ బంధం తెంచుకొనే అవకాశాలు లేకపోలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత్లో డామినోస్ ఫ్రాంచైజీలను జూబిలంట్ ఫుడ్ వర్క్స్ కంపెనీ నిర్వహిస్తుంది. జొమాటో, స్విగ్గీ నుంచి తప్పుకొని రెస్టారెంట్లలోకే ఆ గిరాకీని మళ్లిస్తామని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) వద్ద జూబిలంట్ రహస్యంగా అభ్యర్థన దాఖలు చేసిందట.
కమీషన్ రేట్లను పెంచితే తాము ఫుడ్ అగ్రిగేటర్లతో భాగస్వామ్యం తెంచుకుంటామని జూబిలంట్ నిర్ణయించుకుంది. ఈ మధ్య కాలంలో స్విగ్గీ, జొమాటో రేట్ల పెంపు, కమీషన్లు, రెస్టారెంట్ల ఎంపికలో అనైతిక వ్యాపార ధోరణి కనబరుస్తున్నాయని సీసీఐకి ఫిర్యాదు వచ్చింది. దాంతో జూబిలంట్ను సీసీఐ అభిప్రాయం అడిగింది.
భారత్లో 27 శాతం వ్యాపారం మొబైల్ యాప్, వెబ్సైట్ సహా ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతోందని జూబిలంట్ సీసీఐకి తెలిపింది. స్విగ్గీ, జొమాటో 20-30 శాతం కమీషన్ రేట్లు పెంచితే లాభాలు తగ్గించుకోవాల్సి వస్తుందని, పెరిగిన రేట్ల భారాన్ని కస్టమర్లపై మోపాల్సి వస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది.
కొన్ని రోజులు క్రితం రెస్టారెంట్ల సంఘం స్విగ్గీ, జొమాటోపై సీసీఐకి ఫిర్యాదు చేసింది. వారంతా కుమ్మక్కై అనైతికంగా రేట్లు పెంచుతున్నారని వెల్లడించింది. తటస్థ వైఖరికి బదులు కొన్ని రెస్టారెంట్లు, బ్రాండ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించాయి. వీటిపై సీసీఐ దర్యాప్తు జరుపుతోంది.