Warren Buffett: రెసెషన్లోనూ బఫెటే విన్నర్! ఇన్వెస్టర్ల నమ్మకం!
రెసెషన్ వచ్చినా.. ఇన్ఫ్లేషన్ పెరిగినా.. ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మాత్రం ఎస్ అండ్ పీ 500ను బీట్ చేస్తారని ఫైనాన్స్ ప్రొఫెషనల్స్, రిటైల్ ఇన్వెస్టర్లు వంద శాతం నమ్ముతున్నారు. బెర్కషైర్ హాత్వే షేర్లలో బఫెట్ ప్రీమియం కచ్చితంగా యాడ్ అవుతుందని అంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమెరికాలో రీసెంట్గా మార్కెట్స్ లైవ్ సర్వే నిర్వహించారు. ఇందులో బఫెట్ బెంచ్ మార్క్ ఇండెక్స్‌లను ఈజీగా బీట్ చేస్తారని.. మెరుగైన రిటర్న్స్ అందుకుంటారని ఫ్రొపెషనల్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు చెప్తున్నారు.
352 మంది రెస్పాండెంట్స్లో సగానికి పైగా ఇలాగే జవాబిచ్చారు. వచ్చే ఏడాది అమెరికా కచ్చితంగా రెసెషన్లోకి వెళ్తుందని 65 శాతం మంది బలంగా నమ్ముతున్నారు.
ఇలాంటి టైమ్‌లో డిసిప్లిన్‌తో కూడిన బఫెట్ వాల్యూ ఇన్వెస్టింగ్ మెథడ్ అమేజింగ్‌గా పనిచేస్తుందని అంటున్నారు. ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్ల మైండ్‌సెట్‌ను బట్టి రిటర్న్స్ వస్తాయని పార్టిసిపెంట్లు చెప్పారు.
టెక్నాలజీ కన్నా డిఫెన్సివ్ స్టాక్స్ మెరుగైన పెర్ఫామెన్స్ ఇస్తాయని అంటున్నారు. ఇప్పటికీ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండటంతో టెక్నాలజీ స్టాక్స్‌ను బఫెట్ అవైడ్ చేస్తారని నమ్ముతున్నారు.
44.6 శాతం మంది డిఫెన్సివ్, 20.2 శాతం మంది గ్రోత్, 16.5 శాతం మంది టెక్, 18.8 శాతం మంది ఇతర స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారని అంచనా వేశారు. బఫెట్ ఆయన పాట్నర్ చార్లీ ముంజర్కు కలిపి 180 సంవత్సరాల అనుభవం ఉందని దాంతో బెర్కషైర్ హాత్వే రాణిస్తుందని నమ్మతున్నారు.