Bank Holidays Feb 2022: ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! ఏయే రోజుల్లోనంటే!
డిసెంబర్ 31 మొన్నే జరుపుకున్నట్టు ఉంది! అప్పుడే జనవరి నెల గడిచిపోయింది. ఎప్పటిలాగే ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. రిజర్వు బ్యాంకు చట్టం ప్రకారం ఈ సెలవులు ఉంటాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనే ఒకేలా సెలవులు ఉండవు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2022, ఫిబ్రవరిలో వసంత పంచమి, గురు రవిదాస్ జయంతి, డోలజత్రా వంటి పర్వదినాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆదివారం, రెండో శనివారం వంటి వారంతపు సెలవులు ఉంటాయి. మొత్తంగా 12 రోజులు సెలవులు ఉన్నాయి.
ఫిబ్రవరి 2న సోనమ్ లోచర్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో సెలవు. ఫిబ్రవరి 5న సరస్వతి పూజ, శ్రీ పంచమి, వసంత పంచమి ఉన్నాయి. దాంతో అగర్తలా, భువనేశ్వర్, కోల్‌కతా వంటి నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. 15న మహ్మద్ హజ్రత్ అలీ బర్త్‌డే, లూయిస్ నగై నీ ఉన్నాయి. ఇంఫాల్, కాన్పూర్, లక్నోలో సెలవు. 16న గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో చండీగఢ్‌లో సెలవు. 18న డోల్ జత్రా సందర్భంగా కోల్‌కతాలో సెలవు. 19న ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి. బెలాపూర్, ముంబయి, నాగ్‌పుర్‌లో సెలవు.
ఫిబ్రవరి 6, 13, 20, 27న ఆదివారాలు. ఫిబ్రవరి 12న రెండో శనివారం, 26న నాలుగో శనివారం. వారాంతపు సెలవుల్లో బ్యాంకులు పనిచేయవని అందరికీ తెలిసిందే.
ఫిబ్రవరిలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు కొనసాగుతాయి.