Solar Eclipse On August 2, 2025 : ఆగస్టు 2న 6 నిమిషాల పాటు చీకటి అలుముకుంటుందా? సూర్య గ్రహణం ఆగస్టు 2 లేదా సెప్టెంబర్ 21 ఏ రోజున ఏర్పడుతోంది?
సూర్య గ్రహణం.. గత కొన్ని రోజులుగా ఆగస్టు 2న సూర్య గ్రహణం ఏర్పడుతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ రోజున ప్రపంచంలో కొన్ని నిమిషాల పాటు చీకటి ఏర్పడుతుందని చెబుతున్నారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటో మీరు కూడా తెలుసుకోండి.
ఆగస్టు 2న సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ 2025లో కాదు 2027లో..అంటే రెండేళ్ల తర్వాత వచ్చే ఆగష్టులో అన్నమాట. కేవలం డేట్ మాత్రమే హైలైట్ చేసి జరుగుతున్న ప్రచారం ఇది. రెండేళ్లతర్వాత ఏర్పడే సూర్యగ్రహణం 100 సంవత్సరాలలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం అవుతుంది. దీనిలో భూమిపై కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చీకటి ఏర్పడుతుంది.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ట్యునీషియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్, సూడాన్, సోమాలియా, స్పెయిన్ , ఒమన్తో సహా ఆఫ్రికా, యూరప్ మరియు మధ్యప్రాచ్యం యొక్క అనేక ప్రాంతాలలో కనిపిస్తుంది.
ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం 21 సెప్టెంబర్ 2025 నాడు సర్వ పితృ అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం
సెప్టెంబర్ లో ఏర్పడే ఈ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, ఇండోనేషియా , దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు, కానీ జ్యోతిష్యపరంగా దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది.
మిథున రాశి వారికి సూర్య గ్రహణం శుభ ప్రభావం చూపించదు. ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. మనస్సు కలత చెందుతుంది, విచిత్రమైన ఆలోచనలు వస్తాయి . సంబంధాలపై దీని ప్రభావం కనిపిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన ఉంటుంది.