విశాఖ ఎయిర్‌పోర్టులో నారా లోకేష్ నిరసన- జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు
విశాఖ విమానాశ్రయం బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి నేతలు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపలాస పర్యటనకు వెళ్లిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అనుమతించని పోలీసులు
పలాస వెళ్తున్న లోకేష్‌ను మార్గ మధ్యలోనే అరెస్టు చేసి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ ధర్నాకు దిగారు.
దీంతో అక్కడే కూర్చొని లోకేష్ ఆందోళన చేపట్టారు.
పలాస రాబోతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను శ్రీకాకుళం హైవేపై పోలీసులు అడ్డుకున్నారు.పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొత్తరోడ్డు కూడలి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. లోకేష్‌ను కూడా అరెస్టు చేసి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు.
జేసిబిలు పంపి పేదలు, టిడిపి నేతల ఇళ్లు కూల్చడంతో జగన్ రెడ్డి, వైసిపి నేతల ఫ్యాక్షన్ బుద్ధి మరోసారి బయటపడింది: లోకేష్
జేసిబిలు పంపి పేదలు, టిడిపి నేతల ఇళ్లు కూల్చడంతో జగన్ రెడ్డి, వైసిపి నేతల ఫ్యాక్షన్ బుద్ధి మరోసారి బయటపడింది: లోకేష్ కనీసం పరామర్శకు వెళ్ళడానికి కూడా వీలు లేదని పోలీసులు పౌరుల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరించడం దుర్మార్గం: లోకేష్
పలాసలో జరుగుతున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. నన్ను అరెస్ట్ చేయించి ఊరంతా తిప్పి జగన్ రెడ్డి ఆనందం పొందుతున్నారు: లోకేష్
నా పర్యటనను అడ్డుకోవడానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపైనా, శాంతిభద్రతలు కాపాడటంపైనా పెడితే పరిస్థితులు కాస్తయినా మెరుగుపడతాయి సీఎం: లోకేష్
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది: లోకేష్
పలాస ,శ్రీకాకుళం వెళ్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు: లోకేష్