Rushikonda Palace Photos: రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు, ఫొటోలు చూస్తే షాక్
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో రుషికొండ భవనాలను, స్థానిక నాయకులతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇప్పటివరకూ ఎవరూ చూడని రుషికొండ కట్టడాలను చూసి టీడీపీ నేతలు, ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు.
రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ రుషికొండపై అక్రమంగా నిర్మించిన రాజ్‌మహల్ రహస్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ లాంటి భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం, ఆయన ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను అనుమతులు లేవని కూల్చారని, ఇప్పుడు ఏ అనుమతులతో రుషికొండపై భారీ నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రుషికొండలో నిర్మించినవి ప్రభుత్వ భవనాలే అని, అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని వైసీపీ నేతలు టీడీపీ ఆరోపణలపై స్పందిస్తున్నారు. రుషికొండలో నిర్మాణాలు ఎవరికీ సొంతంకూడా కాదన్నారు.
వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వినియోగిస్తుందనేది వారి ఇష్టం అన్నారు. విశాఖకి గత ప్రభుత్వం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నిర్మించినట్లు వైసీపీ చెబుతోంది.
విశాఖకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినా.. ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదని రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మాణాలు చేపట్టిందని వైసీపీ చెబుతోంది.
గతంలో పర్యాటక భవనాలు అని చెప్పి, ఇప్పుడు అధికారిక భవనాలు చెప్పడంతోనే రాష్ట్ర ప్రజలకు వైసీపీ ఆలోచన ఏంటని తెలిసిపోయిందన్నారు గంటా శ్రీనివాసరావు.