President Fleet Review 2022: సాహస విన్యాసాలు చూసేందుకు సిద్ధమైపోండి, ఫ్లీట్ రివ్యూ 2022కు అంతా రెడీ
21 ఫిబ్రవరి జరగబోయే ఫ్లీట్ సమీక్షకు సిద్ధమవుతున్న భారత నావికాదళం, తూర్పు నౌకాదళ కమాండ్
Download ABP Live App and Watch All Latest Videos
View In App10వేల సిబ్బందితో నిర్హహించే అరవై నౌకలతో కూడిన నేవీ, కోస్ట్ గార్డ్, ఎస్సీఐ, రెండు ఫ్లీట్లను రాష్ట్రపతి సమీక్షిస్తారు.
రాష్ట్రపతి INS సుమిత్రలోని ప్రెసిడెన్షియల్ యాచ్‌లో బయలుదేరి లంగరు వేసిన 44 నౌకల పరిశీలిస్తారు.
55 నావల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఫ్లైపాస్ట్, సబ్‌మెరైన్ & షిప్ ఫార్మేషన్ స్టీమ్ పాస్ట్, ఎలైట్ మెరైన్ కమాండోస్ ద్వారా పారా జంప్‌లు, సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రదర్శన, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్ & ప్రఖ్యాత మదాయి సహా పడవ బోట్ల కవాతు ఉంటుంది.
రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ మొదటి రోజు అంటే 21న ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మారక స్టాప్‌ను రాష్ట్రపతి విడుదల చేస్తారు. సమాచార ప్రసార శాఖ మంత్రి దేవుసిన్హ్ జె చౌహాన్ కూడా ఈ రివ్యూలో పాల్గొంటారు.
21 ఫిబ్రవరి జరగబోయే ఫ్లీట్ సమీక్షకు సిద్ధమవుతున్న భారత నావికాదళం, తూర్పు నౌకాదళ కమాండ్
10వేల సిబ్బందితో నిర్హహించే అరవై నౌకలతో కూడిన నేవీ, కోస్ట్ గార్డ్, ఎస్సీఐ, రెండు ఫ్లీట్లను రాష్ట్రపతి సమీక్షిస్తారు.
చెన్నై నుంచి బయల్దేరిన 'ఆల్ ఉమెన్ ఆర్మీ ఎక్స్‌పెడిషన్' ఈ సాయంత్రం విశాఖపట్నం చేరుకుంది. ఏడుగురు సభ్యుల ఆర్మీ ఆఫీసర్ల బృందం 44 అడుగుల పొడవైన బవేరియా క్లాస్ బోట్లో భారత సైన్యం చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకమైన & సాహసోపేతమైన ప్రయాణం చేసింది.
EME సెయిలింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో 15 ఫిబ్రవరి 22న చెన్నై నుంచి ప్రారంభమైందీ యాత్ర. మొత్తం 330 మైళ్ల దూరాన్ని కవర్ చేశారు.
మేజర్ ముక్తా నేతృత్వంలో 54 గంటల సాహస యాత్ర తర్వాత విశాఖపట్నం చేరుకుందీ బృందం.