Nitin Gadkari Tour: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ చేతులు మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న మరో 31 రహదారులకు శంకుస్థాపన చేశారు.
కేంద్రమంత్రి గడ్కరీ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులు, 31 జాతీయ రహదారుల(National Highways) ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు.
బెంజి సర్కిల్ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్ల ఖర్చయ్యింది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నితిన్ గడ్కరీ.
రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని వాజ్పేయి(Vajpayee) నమ్మారని, వాజ్పేయి హయాంలోనే స్వర్ణ చతుర్భుజి(Golden Quadrilateral) నిర్మాణం జరిగిందన్నారు నితిన్ గడ్కరీ
వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
త్వరలో డీజిల్ లారీలకు బదులు ఎలక్ట్రిక్ లారీలు, డీజిల్ స్థానంలో సీఎన్జీ, ఎల్పీజీ(LPG) రవాణా వాహనాలు రానున్నట్లు పేర్కొన్నారు నితిన్ గడ్కరీ
పోలవరం పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాను జలవనరుల మంత్రిని కాకపోయినా, పోలవరం చూస్తానన్నారు గడ్కరీ
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో జాతీయ రహదారులు అభివృద్ధి జరిగిందని సీఎం జగన్(CM Jagan) అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం శాఖామంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ మంత్రి(Flyover Minister)గా పేరు తెచ్చుకున్నారన్నారు.
రూ.21 వేల కోట్లతో ఏపీలో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి
సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి
తెలంగాణలో కూడా రోడ్లు అత్యంత అభివృద్ధి చెందాయన్న ఆయన...రోడ్డు, సముద్ర, వాయు కనెక్టివిటీ చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) భావిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి
విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం ఎయిర్ పోర్టు(Bhogapuram Airport) వరకు సముద్రతీరంలో ఆరు లైన్ల రహదారి ఏర్పాటు చేసి దాన్ని 16వ నంబరు జాతీయ రహదారి(NH 16)కి అనుసంధానించాలని సీఎం జగన్ కోరారు.
రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి
రూ.7500 కోట్లతో 14 విద్యా సంస్ధలను అభివృద్ధి చేశారన్నారు. శ్రీశైలం, సింహాద్రి, అన్నవరం(Srisailam, Simhadri, Annavaram)లో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి
'ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా అల్లూరి సీతారామరాజు మ్యూజియం(Alluri Sitaramaraju Museum) విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు రాష్ట్రం, కేంద్రం నిర్వహిస్తాయి. విశాఖపట్నంలో అనేక పరిశ్రమలకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణాలో 32 జిల్లాలు పూర్తిగా జాతీయ రహదారి కనెక్టివిటీ ఉంటోంది. విజయవాడ చిన్నది కావడంతో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి
024 నాటికి రాయపూర్- విశాఖ గ్రీన్ ఫీల్డ్ హైవే(Raypur Visakha Green Field Highway) పూర్తి చేస్తాం. పరిశ్రమలతోనే ఉపాధి సాధ్యం. కేంద్ర నిర్వహిస్తున్న గ్రామ సడక్ యోజన ఇప్పుడు అత్యంత కీలకమవుతుంది' అని నితిన్ గడ్కరి అన్నారు