Visakha Public Library: అడవి కాదు లైబ్రరీ, ఆకట్టుకుంటున్న వైజాగ్ లైబ్రరీ ఫొటోస్ చూశారా
విశాఖలో కొత్తగా ఏర్పాటైన మియావాకి లైబ్రరీ పిల్లలను, విద్యార్థులను భలే ఆకట్టుకుంటోంది. ఈ పద్దతిలో ఒక హాల్ ను మొత్తం అడవిని ప్రతిబించేలా రూపొందించారు వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీ అధికారులు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్మార్ట్ఫోన్లనూ, ఆన్లైన్ గేమ్స్‌ను పక్కన పడేసి పుస్తక పఠనం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్నాలజీ తెచ్చే సౌకర్యాలతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా పిల్లల్లో పెరుగుతున్నాయి అంటారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు.
చిన్న వయస్సులోనే పెద్దలు చెప్పినమాట వినకపోవడం, మొండిగా తయారవడం లాంటి అలవాట్లు దరిచేరుతున్నాయి. అలాకాకుండా వాళ్లను ఆరోగ్యకరమైన బుక్ రీడింగ్ వైపు మరల్చడానికి వైజాగ్ లైబ్రరీ సిబ్బంది చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తున్నాయని వారు చెబుతున్నారు.
జపాన్ భాషలో మియావాకి (Akira Miyawaki) అంటే అర్బన్ ఫారెస్ట్ అని అర్ధం. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను లేదా వృక్షాలను పెంచడం అనే కాన్సెప్ట్‌ను జపాన్ దేశానికి చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త ప్రతిపాదించారు.
రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, పట్టణీకరణకు ఇదే సరైన పరిష్కారం అనేది ఆయన సిద్ధాంతం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి.
IT కంపెనీలు, వ్యాపార సంస్థలు,పెద్దపెద్ద అపార్ట్ మెంట్లలో కొంత భాగంలో మొక్కలను పెంచడానికి కేటాయించడం లేదా కనీసం అలాంటి వాతావరణాన్ని కృత్రిమంగానైనా చెయ్యడం మొదలుపెట్టాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీలో ఈ మియావాకి లైబ్రరీ ని ఏర్పాటు చేసి పిల్లల్ని ఆకట్టుకుంటున్నారు.
ఈ మియావాకి హాల్లో ఒకేసారి 25 నుండి 30 మంది పిల్లలు కూర్చుని చదువుకోవచ్చు. దానికోసం 2000 వరకూ పుస్తకాలను ఏర్పాటు చేశారు. వీటిలో పిల్లలకు నచ్చే చిల్డ్రన్ బుక్స్‌తోపాటు పెద్దబాలశిక్ష, మన ఇతిహాసాల వంటి పుస్తకాలు కూడా ఉన్నాయి.