Azadi Ka Amrit Mahotsav: ఏయూలో 300 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. (Photos: Twitter/ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా భారతదేశ స్ఫూర్తిని తెలియ జేస్తూ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో 300 అడుగుల పొడవైన జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. (Photos: Twitter/ANI)
దేశ భక్తిని పెంపొందించడమే లక్ష్యంగా వర్సిటీలో భారీ జాతీయ పతాకం ప్రదర్శించినట్లు ఏయూ విసీ ప్రసాద రావు తెలిపారు. (Photos: Twitter/ANI)
పొడవైన జాతీయ పతాకం ర్యాలీలో విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొని మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. వర్సిటీ విద్యార్థులతో పాటు ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. (Photos: Twitter/ANI)
ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం వద్ద ప్రారంభమైన ర్యాలీ.. కెమికల్ ఇంజినీరింగ్, ప్రిన్సిపాల్ ఆఫీస్, ఈసీఈ బ్రాంచ్, మెకానికల్, సివిల్, విభాగాల మీదుగా ఏయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు కొనసాగించారు. భారత్ మాతాకీ జై అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. (Photos: Twitter/ANI)