President Fleet Review 2022: ఘనంగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, అబ్బుర పరిచిన నేవీ విన్యాసాలు

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ (President Fleet Review 2022) సోమవారం ఘనంగా ప్రారంభమయ్యింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి నౌకాదళ శక్తి సామర్థ్యాన్ని సమీక్షించారు. (Photo Credit: Twitter/ @rashtrapatibhvn)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
60 యుద్ధనౌకలతోపాటు సబ్ మెరైన్స్, 55 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ప్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్లీట్ రివ్యూ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ లో రాష్ట్రపతి 21-గన్-సెల్యూట్ అందుకున్నారు. (Photo Credit: Twitter/ @rashtrapatibhvn)

స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఆత్మనిర్భర్త వైపు పురోగతిని ప్రదర్శించే క్రమంలో ఈ ఫ్లీట్ రివ్యూ కీలకం కానుంది. ఈ సమీక్షలో పాల్గొనే 60 నౌకలు , 47 జలాంతర్గాములు భారతీయ షిప్యార్డ్లలో నిర్మించినవే.
44 యుద్ద నౌకలు 4 వరుసలుగా కొలువుదీరగా వాటి మధ్యనుంచి ఐఎన్ఎస్ సుమిత్ర (INS Sumitra) నౌక ముందుకు సాగింది. నావికాదళ శక్తియుక్తులను రాష్ట్రపతి స్వయంగా తిలకించి అభినందించారు.
భారత నావికాదళం మరింతగా స్వావలంబన సాధిస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవలో నావికాదళం ముందంజలో ఉందని కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ షిప్యార్డ్లలో 70 శాతం నిర్మాణాలు స్వదేశీపరిజ్ఞానంతో జరగడం గర్వకారణమని, భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగిన విషయమని తెలిపారు.
గతేడాది డిసెంబరులో కొచ్చి పర్యటన సందర్భంగా 'విక్రాంత్'ని పరిశీలించడం ఆనందంగా ఉందని గుర్తుచేశారు. స్వదేశీ నౌకాదళ నౌకా నిర్మాణ సామర్థ్యాల అభివృద్ధి 'ఆత్మనిర్భర్ భారత్' తయారీకి అద్భుతమైన సహకారం ఉందన్నారు. భారత నౌకాదళం ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో పాల్గొనడం గర్వించదగ్గ విషయమన్నారు.
విశాఖపట్నం శతాబ్దాలుగా ముఖ్యమైన ఓడరేవుగా ఉందని, ట్రాన్స్-నేషనల్ ట్రేడ్, కామర్స్ కు కీలకమైన కేంద్రం విశాఖని ఆయన తెలిపారు. తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండడం దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతని, 1971 యుద్ధ సమయంలో విశాఖ అద్భుతమైన సహకారం అందించిందని గుర్తు చేశారు. (Photo Credit: Twitter/ @rashtrapatibhvn)
'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' కింద సదరు యుద్ధంలో భారత్ విజయం సాధించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇటీవలే ముగిశాయని, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, భారత నౌకాదళం 'మిషన్ సాగర్' , 'సముద్ర సేతు' ఆపరేషన్లు మరిచిపోలేమని రాష్ట్రపతి అన్నారు. (Photo Credit: Twitter/ @rashtrapatibhvn)