Karthika Deepotsavam: విశాఖలో ఘనంగా కార్తీక మహా దీపోత్సవం
విశాఖలోని రామకృష్ణ బీచ్ లో సోమవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక దీపారాధన చేశారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వరుసగా మూడోసారి విశాఖలో కార్తీక మహాదీపోత్సవాన్ని టీటీడీ నిర్వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి
విశాఖ సాగరతీరంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు శ్రీ ఫణియాజులు బృందం వేదస్వస్తి వినిపించారు.
పండితులు డా.పివిఎన్ఎన్.మారుతి స్వాగతం, సందర్భ పరిచయం చేశారు. వేదస్వస్తి అనంతరం డా. మారుతి దీప ప్రాశస్యాన్ని తెలియజేశారు.
అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు. పండితులు విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు.
ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు.
చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
భక్తుల చెంతకు భగవంతుడు అన్న నినాదంతో దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు, శ్రీనివాస కల్యాణాలు, కార్తీక దీపోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోందన్నారు.
విశాఖపట్నంలో సాగర తీరాన ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో వరుసగా మూడోసారి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించడం మనందరి అదృష్టమన్నారు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి.
ధర్మప్రచారంలో భాగంగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇటీవల శ్రీనివాస కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు.