Vizag Carnival Photos: ఆర్కే బీచ్ రోడ్డులో వైజాగ్ కార్నివాల్ సందడే సందడి
విశాఖపట్నం నగరంలో ఈ నెల 28, 29 తేదీ లలో జి-20 శిఖరాగ్ర సదస్సు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక వై ఎమ్ సి ఎ నుంచి ఆర్కే బీచ్ వరకు వైజాగ్ కార్నివాల్ నిర్వహించారు.
జీ20 సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు రానున్నాదని, వారి కి కావలసిన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రులు తెలిపారు.
ముందుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి జెండా ఊపి వైజాగ్ కార్నివాల్ ప్రారంభించారు.
ఇంఛార్జ్ మంత్రి విడదల రజని, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ సహా కీలక అధికారులు అంతా వైజాగ్ లోనే ఈ సదస్సు పూర్తయ్యే వరకూ ఉండబోతున్నారు.
సీఎం ఆదేశాల మేరకు సుమారు 157 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన విశాఖ నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు మంత్రులు తెలిపారు.
వైజాగ్ కార్నివాల్ లో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి.
వైజాగ్ కార్నివాల్ సెలబ్రేషన్
జీ20 సదస్సు సన్నాహక సమావేశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రులు తెలిపారు.
విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా నగరవాసులు పెద్ద ఎత్తున వైజాగ్ కార్నివాల్ కు తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున, మున్సిపల్ కమిషనర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్, మున్సిపల్, టూరిజం అధికారులు, కళాకారులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.