Global Investors Summit 2023 : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, విశాఖకు తరలివచ్చిన వ్యాపార దిగ్గజాలు
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విశాఖలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు చెప్పినట్లుగానే ప్రముఖ సంస్థల అధినేతలు, వ్యాపార దిగ్గజాలు విశాఖలో ప్రత్యక్షమయ్యారు.
ఏపీకి రూ.13 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ తెలిపారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం చెప్పారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ సాగిస్తున్న పయనంలో ఏపీ కీలకమని తెలిపారు.
975 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్, భారత గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతుందన్నారు. తీరం వెంబడి ఆరు పోర్టులు కలిగి, మరో నాలుగు నిర్మాణంలో ఉన్న ఏపీ... దేశ లాజిస్టిక్ రంగంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉందన్నారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో వివిధ స్టాల్స్‌తో కూడిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ
రాష్ట్రం నుంచి వెళ్లేలా 5 గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని, దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగానే ఈ తొమ్మిదేళ్లలో 4200 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను 8700 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు.
ఒబెరాయ్ గ్రూప్ ఏపీలో రూ.1350 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది. 1350 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
శ్రీ సిమెంట్స్ ఏపీలో రూ.5,500 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది. తద్వారా 1000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
ఏపీలోని క్రిష్ణపట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ అంగీకారం తెలిపారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న దాల్మియా గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా మాట్లాడుతూ.. జే ఫర్ జగన్.. జే ఫర్ జోష్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంతో అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.
ఏపీలో రూ.80వేల కోట్ల పెట్టుబడులకు రెన్యూ పవర్ సీఈవో సుమంత్ సిన్హా ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు.