Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగవైభవంగా ప్రారంభం అయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
మొదటి రోజు రాత్రి 7 నుండి 8 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు.
దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల నడుమ స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేయగా, స్వామి, అమ్మవార్లను దర్శించిన భక్తులు కర్పూరనీరాజనాలు పలికారు.
భక్తుల గోవింద నామస్మరణలతో శ్రీవారి పుష్కరిణి మారుమ్రోగింది.
ఇక రెండో రోజు రాత్రి రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరించనున్నారు స్వామివారు.
శ్రీవారి తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయగా తోమాలసేవ, అర్చన ఏకాంతంగా నిర్వహించనుంది.
మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమల శ్రీవారు