AP Global Investors Summit 2023 : విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు అంతా రెడీ, అద్భుతంగా ఏర్పాట్లు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసదస్సులో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు.
వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు రానున్నారు. రాబోయే ప్రముఖుల అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్ రేపు 2 గంటల ఉంటుంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పైచిలుకు స్టాల్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోపాటుగా, సీఎం జగన్ ప్రారంభిస్తారు.
ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయి.
ఈ సమ్మిట్కి 35 మంది టాప్ పారిశ్రామిక వేత్తలు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు హాజరుకానున్నారు.
సీఎం జగన్ సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలు చేసుకోనున్నారు.
రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సు కోసం ఇప్పటికే 12000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ సదస్సులో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితద పారిశ్రామిక వేత్తలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి కూడా రానున్నారు.
46 దేశాల ప్రముఖులు సదస్సులో పాల్గొనున్నారు. 8 నుంచి 10 మంది అంబాసిడర్స్ కూడా హాజరుకానున్నారు. వారికి రేపు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున విందు కార్యక్రమం ఉంటుంది. డెలిగేట్స్ కు ఆంధ్రా రుచులను పరిచయం చేయబోతున్నామని అధికారులు తెలిపారు.
ఈ సదస్సు జరిగే ఏయూ గ్రౌండ్ ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు.
కేంద్ర మంత్రులను ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరిగే ఏయూ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు