In Pics : ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ఫొటోలు, చరిత్రకు ఆనవాళ్లు
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రకాశం బ్యారేజ్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది బెజవాడ. అటు ఇంద్రకీలాద్రి ఇటు కృష్ణానదికి మధ్యలో నిర్మాణమైన ప్రకాశం బ్యారేజ్ ఆనాటి చరిత్రకు సాక్షి.
ప్రకాశం బ్యారేజ్ ను కేంద్రంగా చేసుకొని అనేక చారిత్రక ఆనవాళ్లు మనకు ఇప్పటికి కనిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కాక ముందు కృష్ణానది ఎలా ఉండేది. రెండు కొండల మధ్యలో నది ప్రవాహం ఎలా సాగిందనేది అందరిని తెలియని అంశం.
అయితే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం తలపెట్టిన సందర్బంలో ఆ రోజుల్లో తీసిన చిత్రాలు. నాటి పరిస్థితులకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.
ఇక్కడ అంతకంటే మరో కీలక అంశం ఏమిటంటే ఇప్పుడున్న బ్యారేజ్ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం కోల్ కతా, చెన్నై రహదారి అన్న విషయం చాలా మందికి తెలియదు.
బ్రిటీషర్లు కోల్ కత్తా నుంచి మద్రాస్ లోని ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు ఇక్కడ మెుదట్లో చిన్న ఆనకట్టని నిర్మించారని చరిత్ర చెబుతోంది.
ఆ తరువాత దానినే కేంద్రంగా చేసుకొని ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగింది.
అప్పట్లో రాకపోకలు చేయాలంటే ఎక్కువ శాతం కాలి నడకనే వెళ్లేవారు. ఆ తరువాత గుర్రపు బండ్లు, కాలక్రమంలో రిక్షాలు అందుబాటులోకి వచ్చాయి.
1954లో కృష్ణా బ్యారేజ్ శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి సీఎం ప్రకాశం పంతులు
పాత ఆనకట్ట ఫొటో ఇది. 1953 వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇందులో ఒకవైపు సీతానగరం కొండ, మరోవైపు విజయవాడ వైపు కొండ కనిపిస్తున్నాయి. ఇది డౌన్ స్ట్రీమ్ వైపు దృశ్యం.
డీజిల్, స్టీమ్ ఇంజిన్ల ద్వారా గేట్లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కాలక్రమంలో బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ఇక్కడే ఎందుకు బ్యారేజ్ నిర్మాణం జరిగిందంటే అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి.
సర్ ఆర్థర్ కాటన్, కృష్ణా ఆనకట్ట డిజైనర్
అటు సీతానగరం కొండ, ఇటు ప్రకాశం బ్యారేజ్ కొండ మధ్యలో నది కాస్త నిదానంగా ప్రవహించేది. రెండు కొండలు మధ్య ప్రదేశం కావటంతో నీటిని అదుపు చేసేందుకు పట్టు దొరికేదని చెబుతున్నారు.
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
అటు సీతానగరం కొండ, ఇటు ప్రకాశం బ్యారేజ్ కొండ మధ్యలో నది కాస్త నిదానంగా ప్రవహించేది. రెండు కొండలు మధ్య ప్రదేశం కావటంతో నీటిని అదుపు చేసేందుకు పట్టు దొరికేదని చెబుతున్నారు.
బ్రిటీష్ పాలకులు మద్రాస్ కు వెళ్లేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నారని, ఆ నాటి పరిస్థితులపై అధ్యయనం చేసిన సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు..
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం
ప్రకాశం బ్యారేజ్ ప్రారంభోత్సవం కార్యక్రమ శిలాఫలకం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
వేప కృష్ణ మూర్తి, 1952లో బ్రీచ్ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు.
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ షట్టర్ల డిజైనర్లు
ఆనకట్టలోని అన్ని షట్టర్లను మూసేసినప్పటి చిత్రం. ఈ ఫొటోలో డౌన్ సైడ్ రోడ్డు కనిపిస్తుంది.
నీటి ప్రవాహాన్ని అడ్డుకున్న ప్రదేశం. ఈ చిత్రంలో హేవ్ లాక్ స్టీమర్ కూడా ఉంది.
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ఇంజినీర్
ఆనకట్టలోని బ్రీచ్ ప్రదేశం.
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ప్రదేశం
నీటి ప్రవాహాన్ని ఆపేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించారు. 40 స్టీల్ బార్జెస్ లో రాళ్లు నింపి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు