In Pics: బియ్యం గింజ సైజులో ఎలుకల బోను, అరగంటలోనే - సూదిపై నర్సు, గణపతి కూడా! గిన్నీస్ బుక్‌లో చోటు
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరో రికార్డు సృష్టించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచంలోనే అతి చిన్న ఎలుకల బోనుని రికార్డు టైంలో రూపొందించి అధికారికంగా గిన్నిస్ లో స్థానం సంపాదించాడు.
కేవలం 5 మిల్లీమీటర్ల పొడవు 2.5 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ ఎలుకల బోను ఉంది.
అంతేకాదు, ఇది సాధారణ ఎలుకల బోను తరహాలో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
29 నిమిషాల్లోనే ఈ బోనుని తయారుచేసిన దయాకర్ గతంలో ఒక భారతీయుడు పేరుపై ఉన్న రికార్డును చెరిపేశాడు.
అప్పట్లో పాత రికార్డు నమోదు చేసిన వ్యక్తికి గంట సమయం పట్టగా అందులో సగం సమయంలోనే దయాకర్ తయారు చేయడం విశేషం.
గత డిసెంబర్ రెండో తారీఖున అధికారుల సమక్షంలో వీడియో తీస్తూ నిబంధనల మేరకు బోను తయారు చేసి గిన్నిస్ రికార్డ్ బుక్ అధికారులకు పంపారు.
తాజాగా దానికి సంబంధించి ప్రశంసాపత్రాన్ని దయాకర్ కి గిన్నీస్ బుక్ అధికారులు అందజేశారు.