In Pics : సిరిసిల్లకు కొత్త హంగులు, మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం అందుబాటులోకి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఆధునిక హంగులను సంతరించుకుంది. మినీ స్టేడియం, మినీ ట్యాంక్ బండ్‌లను మంగళవారం పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాదు. సిరిసిల్ల - కరీంనగర్ ప్రధాన రహదారిలో కొత్త చెరువును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. రూ.13.25 కోట్ల వ్యయంతో 72 ఎకరాల కొత్త చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రీడాకారులకు సౌకర్యం కోసం జిల్లా కేంద్రంలో మినీ స్టేడియాన్ని నిర్మించారు.
ఎప్పటి నుంచో సిరిసిల్ల వాసులు ఎదురుచూస్తున్న మినీ స్టేడియం నిర్మాణం పూర్తయ్యింది. సిరిసిల్ల శివారులో చిన్నబోనాల వద్ద 4.30 ఎకరాల స్థలంలో రూ.5 కోట్లతో ఈ మినీ స్టేడియం నిర్మించారు.క్రీడాకారులను ఆకర్షించే విధంగా ఆర్చ్ రూపొందించారు. మిరుమిట్లు గొలిపే లైటింగ్‌తో క్రీడాభవనాన్ని అధికారులు తీర్చిదిద్దారు.
ఫౌంటేన్‌వద్ద అందమైన శిల్పాలు, స్టేడియంలో టేబుల్ టెన్నిస్, పుట్‌బాల్, స్నూకర్ టేబుళ్లు, స్లాండ్‌తో కూడిన క్యారంబోర్డు, చెస్‌బోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, స్టాండ్‌తో లూడో బోర్డులు, వాలీబాల్ కోర్టు, లాంగ్‌జంప్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, హైజంప్, ఆర్చరీతోపాటు క్రికెట్ ప్రాక్టీస్ కోసం నెట్‌లను ఏర్పాటు చేశారు.
పిల్లల కోసం కూడా స్లాయిడ్స్ లాంగ్ కోర్టు, పుట్‌బాల్, హాకీ, డిస్క్ త్రోయింగ్ వంటి పరికరాలను అందుబాటులో ఉంచారు
పిల్లల కోసం కూడా స్లాయిడ్స్ లాంగ్ కోర్టు, పుట్‌బాల్, హాకీ, డిస్క్ త్రోయింగ్ వంటి పరికరాలను అందుబాటులో ఉంచారు. ఔట్‌డోర్, ఇండోర్ కోర్టులతోపాటు అన్ని హంగులు సమకూర్చారు. మినీ స్టేడియం సిరిసిల్లకు ప్రత్యేక ఆకర్షణగా ఉందని స్థానికులు అంటున్నారు.
ఫౌంటేన్‌వద్ద అందమైన శిల్పాలు, స్టేడియంలో టేబుల్ టెన్నిస్, పుట్‌బాల్, స్నూకర్ టేబుళ్లు, స్లాండ్‌తో కూడిన క్యారంబోర్డు, చెస్‌బోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, స్టాండ్‌తో లూడో బోర్డులు, వాలీబాల్ కోర్టు, లాంగ్‌జంప్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, హైజంప్, ఆర్చరీతోపాటు క్రికెట్ ప్రాక్టీస్ కోసం నెట్‌లను ఏర్పాటు చేశారు.
క్రీడాకారులకు సౌకర్యం కోసం జిల్లా కేంద్రంలో మినీ స్టేడియాన్ని నిర్మించారు.
క్రీడాకారులకు సౌకర్యం కోసం జిల్లా కేంద్రంలో మినీ స్టేడియాన్ని నిర్మించారు.
ఇప్పటికే సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు, అనంతగిరి ప్రాజెక్ట్‌ల వద్ద పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్ వద్దే సుందరంగా మార్చడానికి సిరిసిల్లలో కరకట్టను నిర్మించారు.
బ్యాక్ వాటర్ వద్ద రోప్‌వేలు, కాటేజీల నిర్మాణానికి ప్రాజెక్ట్ రూపొందించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వార్డుల్లో మినీ పార్కుల నిర్మించారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను పూర్తిచేశారు.