AP CM Chandrababu: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానంతో రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీయే కూటమి పక్షనేత చంద్రబాబు నాయుడిని రాష్ట్ర గవర్నర్ జస్జిస్ అబ్దుల్ నజీర్ కోరారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగవర్నర్ ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం (జూన్ 11న) సాయత్రం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.
ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నేతలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించారు.
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. అనంతరం మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధినేత చర్చించారు.
బుధవారం (జూన్ 12న) ఉదయం 11:27 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించనున్నారు. వీలైతే ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించేందుకు రావాలని గవర్నర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.