Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: జనసేన కేంద్ర కార్యాలయంలోని యాగశాలను సందర్శించిన సినీ ప్రముఖులు
ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన యాగ క్రతువులో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు సోమవారం పాలు పంచుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమైత్రి మూవీస్ నుంచి వై.రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్మంట్ నుంచి డీవీవీ దానయ్య, మెగా సూర్యా ప్రొడక్షన్ నుంచి ఏఎం రత్నం, ఎస్వీసీసీ నుంచి బీవీఎస్ఎన్ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి శ్రీ వివేక్ కూచిభొట్లతోపాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ లు యాగశాలకు విచ్చేసి అక్కడ ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించారు.
మహా యాగ నిర్వహణా నిమిత్తం వేద మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల వద్ద ఉంచిన మంత్ర కళశాలకు నమస్కరించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
యాగశాలలో శాస్త్రోకంగా పూజల అనంతరం నిర్మాతలు, దర్శకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. కార్యాలయంలోనే ఉన్న వారాహి రథం గురించి అడిగారు. దర్శకనిర్మాతలను పవన్ తన వారాహి రథం వద్దకు తీసుకెళ్లారు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ (SVCC) ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు.