In Pics: బద్వేలులో నారా లోకేశ్ యువగళం, తరలివచ్చిన జనం - ఫోటోలు
యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 124 రోజుకు చేరుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబద్వేలు మండలంలోని విద్యానగర్‌లో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది.
ఎన్జి.కాలనీ, సీఎస్ఐ చర్చి, ఆర్టీసీ బస్టాండ్, నాలుగు రోడ్ల కూడలి, పోరుమామిళ్ల బైపాస్, గోపవరం మండలంలోకి ప్రవేశించింది.
అక్కడి నుంచి శ్రీనివాసపురం, పీపీ కుంట విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది.
స్థానికులు, క్రిస్టియన్లు, ఎస్సీ సామాజిక వర్గీయులు, స్థానికులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేల్‌ని మండలాల వారీగా కేకులా కోసి బంధువులకు పంచేశారని విమర్శించారు.
గోవిందరెడ్డి, వైసీపీ నేతలు రమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, గురు మోహన్, శ్రీరాములు, పోల్‌రెడ్డి, ఎల్లారెడ్డి కలిసి రెండు వందల కోట్లు విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కొట్టేశారని పేర్కొన్నారు.
పోరుమామిళ్లలో ఫుడ్ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మేశాడన్నారు.
జగన్ బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాలకు సోమశిల బ్యాక్ వాటర్ వద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చారని లోకేశ్ అన్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి పోరుమామిళ్ల, కలసపాడు మండలాలకు రెండేళ్లలోనే సాగు, తాగునీరు అందిస్తాం అని చెప్పి మోసం చేసారని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగు నీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.