Anjanadri In Tirumala: అంజనాద్రిలో హనుమన్ ఆలయం అభివృద్ధి పనులకు టీటీడీ శంకుస్థాపన
వెంకన్న సన్నిధిలో అంజనాద్రిలో హనుమంతుడు జన్మించాడని టిటిడి పాలక మండలి నిర్ధారించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభౌగోళిక, శాసనాలు, పౌరాణిక ఆధారాలను కమిటీ సేకరించి ఆధారాలతో ఆంజనేయుడు అంజనాద్రిలోనే జన్మించాడని నిర్దారించిన టీటీడీ
ఆకాశ గంగ తీర్ధంలోని బాలహనుమన్ ఆలయ సుందరీకరణకు టిటిడి శ్రీకారం చుట్టింది.
పనుల శంకుస్థాపనకు హాజరైన మఠాధిపతులు, పీఠాధిపతులు
టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డితో పూజుల చేయించిన స్వరూపనందేద్ర సరస్వతి
అనేక వాదనలు ఉన్నా జాతీయ సాంస్కృతి విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ మురళిధర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి స్థల నిర్దారణ చేసిన టీటీడీ
రామాయణం,ఇతిహాసాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్ధానం అత్యంత ప్రామాణికంగా తీసుకునే వెంకటాచల మహత్యంలోను ఏడు కొండల్లో ఉండే అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్ధలంగా నిర్దారించినట్టు తేల్చిన టీటీడీ
ఆకాశ గంగలో గత ఏడాది హనుమన్ జయంతి వేడుకలను ఐదు రోజుల పాటు వేడుకగా నిర్వహించింది టీటీడీ
అంజనాద్రి హనుమన్ జన్మస్ధలం కాదని హనుమత్ జన్మస్ధలం తీర్ధ ట్రస్టు పీఠాధిపతి గోవిందానంద సరస్వతి వ్యతిరేకిస్తూనే ఉన్నారు
అంజనాద్రే హనుమన్ జన్మస్ధలంగా టిటిడి చేప్పే మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆయన ఆరోపిస్తున్నారు గోవిందానంద సరస్వతి
అన్ని వివాదాలను పరిష్కరించి బాలాంజనేయ అలయ అభివృద్ధికి టీటీడీ శ్రీకారం చుట్టింది.
గోవిందానంద సరస్వతి వద్ద ఎటువంటి ఆధారాలు లేక పోయినా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, స్వలాభం కోసం ఇటువంటి పనులు చేస్తున్నారని వాదిస్తోంది టిటిడి
శ్రీనివాసుడి వైభవంను తగ్గించేలా టీటీడీ చేస్తుందని కర్నూలు జిల్లాకు చెందిన రాఘవేంద్రతో పాటు మరో ఇద్దరు కోర్టులో పిల్ వేశారు.
ఈ వివాదంపై వాదనలు వినిపించిన కోర్టు అంజనాద్రిలో సుందరీకరణ పనులు మినహా, ఆలయం నిర్మాణ పనులు చేయరాదంది.
ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని ప్రతివాదులైన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్ కి, టిటిడి ఈవోకి నోటీసులు జారీ చేసింది..
ఈ వివాదంపై ఈనెల 21న మళ్లీ విచారించనుంది కోర్టు