In Pics: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: చిన్నశేష వాహనంపై స్వామివారు, ఫోటోలు చూసి తరించండి
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి వారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఆసీనుడైన మలయప్ప స్వామి వారు తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఐదు శిరస్సుల నాగేంద్రుడిపై ఆ గోవిందుడు ఉదయాన్నే దర్శనమివ్వడంలో ఎన్నో మర్మాలున్నాయి.
సర్పాన్ని కాలంతో పోల్చుతారు.
నాగేంద్రుడు ఐదు శిరస్సులు మానవుడి పంచేంద్రియాలుగా భావిస్తారు.
పంచేద్రియాలను నియంత్రించుకోనే శక్తిని తనను ఆరాధించడం ద్వారా భక్తుడికి కలుగుతాయన్నది ఈ వాహనసేవ పరమార్ధం.
పంచేంద్రియాలను నియంత్రించి దృష్టిని తనవైపు మరల్చిన నాడు కాలాతీతుడైన తనను చేరుకోవచ్చని తాను కాలానికి అతీతుడని చిన్నశేషవాహనంపై స్వామి వారు తెలియజేస్తారు.
ద్వాపరయుగంలో తనను నమ్మిన గోపాలకులను రక్షించడానికి కాళియా సర్ఫంపై తాండవం చేసిన ఆ చిన్ని కృష్ణుడు ఈ కలియుగంలో భక్తుల కోంగుబంగారమైన పిలిచినంతనే పలికే దైవంగా చిన్నశేషవాహనంపై స్వామి దర్శనమిస్తారు.
ఈ వాహనసేవను దర్శిస్తే చాలు, కుండలినీ యోగసిద్ది ఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ వాహన సేవను భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భక్తులను అలరించిన మహిళల కోలాటం
యువతుల నాట్య విన్యాసాలు
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు
ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు, దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
సంప్రదాయ నృత్యాలతో అలరించిన యువతులు
చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి వారు