In Pics: తిరుమలలో శ్రీలంక ప్రధాని రాజపక్సే.. సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే, సతీమణి షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీలంక ప్రధాని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
ఆ తరువాత జేఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
విమానాశ్రయంలో వారిని భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు స్వాగతం పలికారు.