Devatha serial Actress suhasini Photos: దేవత సీరియల్ రుక్మిణి (సుహాసిని) ఎన్ని సినిమాల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
దేవత సీరియల్ లో రుక్మిణిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సుహాసిని నెల్లూరు జిల్లాలో వెంకట రెడ్డి,జ్యోతి దంపతులకు 1983 మే 26 జన్మించింది. 9వ తరగతి నుంచి నటనవైపు అడుగులు వేసింది. చంటిగాడు మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
లక్ష్మీ కళ్యాణం, అడ్డా,దోస్త్ సహా దాదాపు 30సినిమాల్లో నటించిన ఈమె తమిళం, కన్నడంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ తో అందరి నట్టింట్లోకి వచ్చింది. అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో ప్రత్యేక పాత్రలో నటించింది. తమిళంలోను ఓ సీరియల్ లో దాదాపు మూడేళ్ళ పాటు నటించింది. అయితే తెలుగులో ఇద్దరమ్మాయి సీరియల్ లో నటిస్తున్నప్పుడు సీరియల్ నటుడు ధర్మతో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం 'దేవత' సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తోంది సుహాసిని. ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు 25 వేలు పారితోషికం తీసుకుంటోందని టాక్. అయితే కేవలం నటనకే అంకితం కాకుండా కొన్ని సీరియల్స్ కి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది.
దేవత రుక్మిణి అలియాస్ సుహాసిని ( image credit : Suhasini /Instagram)
దేవత రుక్మిణి అలియాస్ సుహాసిని ( image credit : Suhasini /Instagram)
దేవత రుక్మిణి అలియాస్ సుహాసిని ( image credit : Suhasini /Instagram)