In Pics: తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఫోటోలు మీరూ చూసేయండి
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్యన మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగరవేశారు.
శ్రీ రామకృష్ణ దీక్షితులు కంకణభట్టర్గా వ్యవహరించారు.
సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ రోజున ప్రజలు, భక్తులు, యాత్రికులకు పోలీసులు కీలక సూచనలు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపును గమనించి ప్రత్యామ మార్గాలను ఉపయోగించుకోవాలని, అలాగే ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు, భక్తులకు తిరుపతి పోలీసులు విజ్ఞప్తి చేశారు.