In Pics: రోడ్డుపై కూర్చొని చంద్రబాబు నిరసన - కుప్పంలో రచ్చరచ్చ, అన్నా క్యాంటిన్ ధ్వంసం
కుప్పంలో నేడు ప్రారంభించనున్న అన్నా క్యాంటిన్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైఎస్ఆర్ సీపీ నేతల తీరుకు నిరసనగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అంతకుముందు ఆయన కార్యకర్తలతో కలిసి కుప్పంలోని అన్నా క్యాంటిన్ వరకూ ర్యాలీగా వచ్చారు.
రెండో రోజు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
చంద్రబాబు పర్యటనలో నేడు అన్న క్యాంటీన్ ప్రారంభించాల్సి ఉంది.
ప్రారంభోత్సవానికి చేరుకుని అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. లోపలి ఫ్లె్క్సీలను చింపేశారు.
స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టేబుళ్లు ధ్వంసం చేశారు.
చంద్రబాబు పర్యటనకు బదులుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు.
అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టీడీపీ నాయకులపై దౌర్జన్యంతో వైసీపీ నేతలు దాడికి దిగారు. వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి చేసిన నిరసనలకు పోటీగా, తెలుగు దేశం కార్యకర్తలు కూడా నిరసనలకు దిగారు.
తెలుగు దేశం కార్యకర్తలు ఎమ్మెల్సీ భరత్ ఇంటికి ర్యాలీగా బయలుదేరారు.
మరోవైపు, చంద్రబాబు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దాడికి నిరసనగా కుప్పంలో పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు.
అన్నా క్యాంటిన్ వద్దకు వచ్చి వైఎస్ఆర్ సీపీ నేతల తీరును ఖండించారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.