బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం సింహ వాహనంపై శ్రీనివాసుడు దర్శనం
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం సింహ వాహనంపై శ్రీనివాసుడు దర్శనం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమాఢ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని మలయప్ప స్వామి వారు అధిరోహించారు.. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం.
ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది.
అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు.