Pooja hegde: ముంబైలో బుట్టబొమ్మ సందడి!
నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో పూజా హెగ్డే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన తొలినాళ్లలో పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది.
దువ్వాడ జగన్నాథం సినిమాతో పూజా కెరీర్ ట్రాక్ లో పడింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పూజాకు వరుస అవకాశాలు వచ్చాయి.
దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమాలు చేసిన తర్వాత హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆయన దర్శకత్వంలో నటించిన అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి.
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న సినిమాకు హీరోయిన్ గా ఓకే అయ్యింది.
మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ నటిస్తున్నది.
తాజాగా పూజా తన అందం మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందనే టాక్ నడుస్తుంది. ఇందుకోసం తన ముక్కుకు సర్జరీ చేయించుకోవాలి అనుకుంటుందట.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.