Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
కూలీలతో మాటామంతీ- కురబ కులస్తుల సమస్యలపై చర్చ- ఐదో రోజు ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర
చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసమస్యలు ఎకరవు పెడుతున్న ప్రజలు
టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత పన్నుల భారం తగ్గించి, ప్రతి పేద వాడికి ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన లోకేష్
కస్తూరి నగరంలో మాట్లాడుతూ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, భూకబ్జాలు తప్ప స్థానిక ఎమ్మెల్యేకి అభివృద్ది అంటే పట్టదని కామెంట్
సొంత ఊరికి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని ఎమ్మెల్యేకు డిమాండ్
సొంత ఊరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు ప్రజలు, యువత వెళ్లిపోతుంటే ఎమ్మెల్యే మాత్రం అక్రమ సంపాదన పైనే దృష్టి పెట్టారని కామెంట్
పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లిలో కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్
జగన్ పాలనలో పడుతున్న సమస్యలు ఏకరువు పెట్టిన కురబ సామాజిక వర్గం ప్రతినిధులు
బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టిడిపి గెలిచిన తరువాత వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి అన్న లోకేష్
కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి- టిడిపి హయాంలో 90 శాతం సబ్సిడీతో 10 లక్షల వరకూ రుణాలు ఇచ్చామన్నారు.
మినీ గోకులంలు నిర్మిస్తే.. జగన్ కురుబల గొంతు కోసారని విమర్శ
రిజర్వేషన్లు కట్ చెయ్యడం వలన పెద్ద ఎత్తున కురబలు నష్ట పోయారు
కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను ఏర్పాటు చేశారు- కూర్చోడానికి కుర్చీలు లేవు- 3 ఏళ్ల 8 నెలల్లో ఒక్క లోన్ కురబలకి ఇవ్వలేదు: లోకేష్
బైరెడ్డి మండలం దేవతోటి వద్ద వరినాట్లు వేసే రైతు కూలీలతో మాట్లాడిన నారా లోకేష్
సమస్యలు ఎకరవు పెట్టిన మహిళా కూలీలు
ఎన్నడూ లేనంతగా నిత్యవసర ధరలు పెరిగాయని, గ్యాస్ ధరలు పెంచారన్న కూలీలు
కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందన్న కూలీలు
ఇంటి పట్టాకోసం ఎన్ని అర్జీలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజల ఫిర్యాదు
నీళ్ళు కారే ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన
రేషన్ బియ్యంలో కల్తీ బియ్యం కలుపుతున్నారని ఫిర్యాదు
జగన్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయమన్న కూలీలు
ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ పీకింది ఎంటి...?? కురబకి చేసింది ఎంటి..?: లోకేష్
బిసి శాఖ మంత్రి స్వయంగా రిజర్వేషన్లు తగ్గించాం అని ఒప్పుకుంటున్నారు.: లోకేష్
కానీ 16 వేల పదవులు పోలేదు అంటున్నారు. మరి ఎన్ని పదవులు పోయాయో ఆయనే చెప్పాలి : లోకేష్
చెత్త మీద పన్ను వేసినందుకు జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలా..? : లోకేష్