Parveta Utsavam In Tirumala: శ్రీవారి ఆలయంలో వైభవంగా పార్వేట ఉత్సవం, కనుమ నాడు ఆనవాయితీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమకర సంక్రాంతి పర్వదినం మరుసటి రోజున కనుమ పండుగ నాడు పార్వేటి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
గోదాదేవి పరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పించారు.
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ కృష్ణ స్వామి వారు పార్వేట మండపానికి వేంచేపు చేశారు.
అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహించారు.. అనంతరం స్వామి వారు ఆలయానికి చేరుకున్నారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమలనంబి ఆలయానికి వేంచేపు చేశారు.
అనంతరం మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.