Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు
1948లో డాలర్ శేషాద్రి జన్మించారు. అసలు పేరు పాల శేషాద్రి. మెడలో పోడువైన డాలర్ ధరించి ఉండడం వల్ల డాలర్ శేషాద్రిగా పేరు. శేషాద్రి పూర్వీకులు తమిళనాడు రాష్ర్టంలోని కంచికి చెందినవారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల నంబి ఆలయంలో శేషాద్రి తండ్రి స్వామి గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుపతిలోనే జన్మించి విద్యాభ్యాసం పూర్తిచేశారు. అప్పట్లోనే పీజీ వరకూ చదివారు.
1978లో టీటీడీలో చేరారు. 2006 జూన్లో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఒఎస్డీగా కొనసాగుతున్నారు. శేషాద్రికి భార్య చంద్ర, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 2013లో కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.
2016లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చికిత్స అనంతరం శేషాద్రి కోలుకున్నారు. 2006లో శేషాద్రిపై బంగారు డాలర్ల మిస్సింగ్ అభియోగం మోపారు. విచారణలో ఆయన సచ్ఛీలుడిగా బయటపడ్డారు.
2009లో అప్పటి ఈవో క్రిష్ణారావు ఆదేశాలు మేరకు తొమ్మిది నెలలు విధులకు శేషాద్రి దూరమైయ్యారు. తిరిగి కోర్టు ఆదేశాలతో విధులలో చేరారు. సర్వీసులో 15 నెలలు కాలం మినహయిస్తే పూర్తిగా శ్రీవారి సన్నిధిలో డాలర్ శేషాద్రి విధులు నిర్వర్తించారు.
ఏడు కొండల్లో ఒకటైన.. శేషాద్రి.. పేరుతో ఉన్న డాలర్ శేషాద్రి అంతటి ప్రసిద్ధుడు. 43 ఏళ్లుగా స్వామి సేవలోనే ఆయన తరిస్తున్నారు. టీటీడీలో ఉద్యోగి అయినప్పటికీ.. ఆయన ఆహార్యం రీత్యా అందరూ అర్చకులు అనుకుంటారు.
తిరుమల ఆలయం ముందు డాలర్ శేషాద్రి లేని.. వీఐపీ ఫోటో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. చిన్న రాజకీయ నేతల నుంచి రాష్ట్రపతుల వరకూ అయనకు అందరితో నేరుగా పరిచయం.
స్వామికి అత్యంత భక్తుడైన.. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు శేషాద్రి ఎంతో సన్నిహితులు.
వేంకటాద్రిలో జన్మించి.. సింహద్రిలో ప్రాణాలు విడిచిన డాలర్ శేషాద్రి. సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణతోనూ సన్నిహిత సంబంధాలు.
తిరుమల పర్యటన సందర్భంగా స్వయంగా శేషాద్రి ఇంటికి వెళ్ళిన జస్టిస్ ఎన్వీ రమణ. చివరి తిరుమల పర్యటన సమయంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, మరోసారి తిరుమలకు విచ్చేసిన సమయంలో ఇంటికి వస్తానని శేషాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.