In Pics : అశ్వవాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీవారు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు.
సన్ ప్లవర్ వేషధారణలో కళాకారులు
బ్రహ్మోత్సవాల్లో నృత్యప్రదర్శన
తిరుమలలో కళాకారుల ప్రదర్శన
కాళికాదేవి వేషధారణ
అశ్వ వాహనంను అధిరోహించిన మలయప్ప స్వామి వారికి తిరుమాఢ వీధిలో భక్తులు కర్పూర హారతులు పలికారు.
అశ్వ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారి దర్శన భాగ్యంతో తిరుమాడ వీధులు గోవింద నామస్మరణలతో మారుమోగాయి.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.
స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
భరతమాత రూపంలో కళాకారుల ప్రదర్శన
అశ్వ వాహన సేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. రేపు రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.