Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Tirumala : తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు, హనుమంతునిపై వేంకటాద్రి రాముడు
తిరుమలలో శ్రీ రామ నవమి వేడుకలు కన్నులపండువగా సాగాయి. శ్రీరాముడు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారిని శ్రీరాముడిగా భావించి, శ్రీవారి సుప్రభాతాన్ని రచించిన శ్రీ హస్తిగిరినాథన్ ''కౌసల్యా సుప్రజా రామ..'' అంటూ స్తుతించారు.
రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, ఆ శ్రీ కృష్ణుడే కలియుగంలో శ్రీనివాసుడు. కావున శ్రీవారు వేంకటరాముడు, వేంకట కృష్ణుడు, వేంకటాచలపతి ఇలా త్రివేణిసంగమయిన సేవ హనుమంత వాహనసేవ.
దాస్యభక్తుల్లో హనుమంతుడు పేరెన్నికగన్నవాడు.. వేదాలూ, వ్యాకరణాలూ సమస్తం క్షుణ్ణంగా తెలిసినవాడు. హనుమంతున్ని సేవిస్తే, రోజూ భక్తితో దర్శిస్తే, భక్తులకు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, మంచి వాక్శక్తి సిద్ధిస్తాయి.
అందుకే హనుమంతుడు భక్తులతో '' మీకు కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక, ధార్మిక ఫలాలన్నీ నేనే ఇస్తా, మోక్షం మాత్రం నాస్వామి రామయ్యనే సేవించి పొందండి'' అన్నాడు.
హనుమంతునిపైనున్న శ్రీవారిని దర్శించడంతో ఇహమేకాక పరమమైన మోక్షంకూడా లభిస్తుంది. అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు.