Pawan Kalyan: కాకినాడ పోర్టుకు వెళ్లి షిప్లో పవన్ కళ్యా్ణ్ తనిఖీలు, ద్వారంపూడికి లింక్స్ పై అధికారులను ఆరా
అక్రమ బియ్యం రవాణాపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆయన స్వయంగా కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల కిందట కాకినాడ పోర్టులో స్వాధీనం చేసుకున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో ఉన్న 1064 టన్నుల బియ్యం సంచులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ తో కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై పవన్ కళ్యాణ్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రెండు రోజుల కిందట పట్టుకున్న 640 టన్నుల రేషన్ బియ్యంను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకున్నారు. ఆ బియ్యాన్ని అధికారులు పోర్టులోనే ఉంచారు.
కొన్నేళ్లుగా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి భారీ ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోందని... స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోతున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. పోర్టులో వ్యాపారమంటే స్మగ్లర్లను అనుమతించటమేనా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది.
దేశాల సరిహద్దు దాటి ప్రజాధనం దుర్వినియోం అవుతుంటే స్థానిక కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. భద్రతా విభాగాలు సైతం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర హోంమంత్రిత్వశాఖలకు లేఖలు రాయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇలాంటి వాటిపై ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.5
బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, వారు ఎంత వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. రేషన్ బియ్యం యథేచ్చగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారు. ప్రజా ధనం వృథా కావడం, పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు వెళ్లడంపై పవన్ కళ్యాణ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ తనిఖీల సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ప్రస్తావన వచ్చింది. ద్వారంపూడి సోదరుడి ఎక్స్ పోర్ట్ సంస్థ నుంచి సరఫరా చేసిన బియ్యం షిప్ లో ఉన్నట్లు అధికారులు పవన్ కళ్యాణ్ కు తెలిపారు.