Sobhita Naga Chaitanya Wedding Rituals : అచ్చమైన తెలుగు పెళ్లి చేసుకుంటున్న శోభిత, నాగచైతన్య.. మంగళస్నానం ఫోటోలు చూశారా?
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లిపనులు హడావుడిగా జరుగుతున్నాయి. తాజాగా బంధువుల సమక్షంలో వారికి మంగళస్నానం చేయించారు. (Images Source : Instagram/ pinkvilla)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశోభిత చెప్పినట్టుగా తెలుగు సాంప్రదాయపద్ధతిలో తన పెళ్లి జరిగేలా చూసుకుంటుంది. దానిలో భాగంగానే మంగళస్నానం కార్యక్రమం చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/ pinkvilla)
ఈ ఫోటోల్లో శోభిత తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ మంగళస్నానం కార్యక్రమానికి ముందు గోధుమరాయి, పసుపు దంచడం వంటివి కూడా శోభితా ఫాలో అయింది. (Images Source : Instagram/ pinkvilla)
డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి జరగనుంది. ఈ తంతు సుమారు 8 గంటలు ఉండబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. (Images Source : Instagram/ pinkvilla)
శోభిత మంగళస్నానం లుక్లో చాలా అందంగా కనిపించింది. నిండుగా చీరకట్టుకుని.. నగలు సింగారించుకుని.. అందంగా నవ్వేస్తూ.. సంతోషంగా కనిపించింది. (Images Source : Instagram/ pinkvilla)