Amalapuram News Today: మనవరాలికి కాకి, గులక రాళ్ల కథ చెప్పిన తాత- నీళ్ల కోసం సెల్ఫోన్ బావిలో వేసి చిన్నారి!
Khagesh
Updated at:
25 Nov 2024 02:17 PM (IST)
1
మాజీ ఎంపీ, సీనియర్ నేత హర్షకుమార్కు విచిత్రమైన అనుభవం ఎదురైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఒకరోజు హర్షకుమార్ తన మనవరాలికి కాకికి దాహం వేసిందని గులకరాళ్లను కుండలో వేస్తే నీరు పైకి వచ్చిందని, కాకి తన దాహం తీర్చుకుందనే కథ చెప్పారు.
3
ఈ మధ్య హర్షకుమార్ సెల్ఫోన్ కనిపించలేదు. ఆరా తీస్తే మనవరాలు అసలు సంగతి చెప్పింది.
4
కుండలో కాకి గులకరాళ్లు వేస్తేనే నీళ్లు పైకి వచ్చాయని అలానే తాను కూడా బావిలో సెల్ఫోన్ వేశానంటూ చెప్పుకొచ్చింది హర్షకుమార్ మనవరాలు
5
ఆ సమాధానం విన్న తాత హర్షకుమార్కు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.
6
చివరకు కూలీలను పురమాయించి బావిలో జల్లెడ పట్టారు. చివరకు సెల్ఫోన్ దొరికిందని చూపించారు.
7
ఈ విషయాన్ని మీడియాతో పంచుకొని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు మాజీ ఎంపీ హర్షకుమార్