CM Jagan Tour: కేంద్రం చేతిలో పని కాబట్టే ఆగుతున్నాం- లేకుంటే ఎప్పుడో చెల్లించేవాళ్లం-పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలతో సీఎం జగన్
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్
చింతూరులో హెలీప్యాడ్ వద్ద వరద తీవ్రత, సహాయ చర్యలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించిన సీఎం
గోదావరి ముంపునకు గురైన కొయగురులో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సీఎం.
కొయగురు నుంచి చట్టి వరకు దారిపొడవునా వరద బాధితులను నేరుగా కలుస్తూ.. వారికి భరోసా ఇచ్చిన జగన్
దారిపొడువునా బాధితులతో ముచ్చటిస్తూ... వారికి భరోసా కల్పించిన జగన్.
image 7
నాలుగు ముంపు మండలాలు (చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక) రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించిన సీఎం. నష్టపోయిన ప్రతి ఇంటికీ, పంటకూ పరిహారం ఇస్తామని హామీ. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా.
20 రోజులుగా కలెక్టర్ నాలుగుమండలాల్లోనే ఉన్నారు. గతంలో ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జేసీలు ఉండేవారు. ఈ రోజు వ్యవస్ధలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు 6 మంది కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు ఉన్నారు. వీరికి తోడుగా వాలంటీర్లు ఉన్నారు. ఏ ఒక్కరికీ సాయం అందలేదన్న పరిస్థితి లేదన్నారు జగన్.
ఇప్పటికే 25 కేజీల బియ్యంతో సహా ప్రభుత్వం ఇచ్చిన నిత్యావసరాలు అందరికీ అందాయా ? లేదా అని ప్రశ్నించారు. ఈ స్ధాయిలో పారదర్శకంగా ఎప్పుడూ గతంలో జరగలేదన్నారు జగన్.
సాధారణంగా నాయకులు వస్తారు. అది బాగోలేదు. ఇది బాగోలేదంటూ ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేసి వెళ్లి పోయే పరిస్థితి. అలా కాకుండా అధికారులకు ఏం వనరులు కావాలో అవి వారి చేతిలో పెట్టి వారికి దిశానిర్దేశం చేశామన్నారు జగన్.
మళ్లీ వారం రోజుల్లో తాను వస్తానని... నేను వచ్చేసరికి ఏ ఇంట్లో కూడా మంచి జరగలేదని మాట రాకూడదని ఆదేశించారు.
తాటాకు ఇళ్లు, పొలాలు, పంటలు నష్టం జరిగినా బాధపడవద్దని భరోసా ఇచ్చారు జగన్. ఇళ్లకు, పంటలకు నష్టం జరిగిన మేరకు తగిన పరిహారం ఇస్తామన్నారు. 8 వారాలు లేదా 2 నెలల్లో ప్రతి ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామన్నారు.
ఐటీడీఏ పరిధిలోకి ఉన్నందున పూరి గుడిసెలకు గతంలో ఇచ్చిన రూ.4 వేల నుంచి 10 వేలకు నష్టపరిహారాన్నిపెంచి ఇస్తామని తెలిపారు జగన్.
పోలవరం ముంపునకు సంబంధించిన ఆర్అండ్ అర్ ప్యాకేజీ 45.72 అంటే పూర్తి నీటి మట్టం వరకు ప్యాకేజీ ఇవ్వాలంటే మరో 20 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. దీనిపై రోజూ కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
ఇప్పటికే రూ. 2,900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. అవి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పలు దఫాలుగా లేఖలు కూడా రాశామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తైనా పూర్తిగా నీళ్లు నింపబోమన్నారు జగన్. డ్యామ్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి నీళ్లు నింపకూడదని కేంద్ర జలవనరుల సంఘం చెబుతోందన్నారు.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలి సంవత్సరం కొంత నీటిని నింపుతామని... అలా దఫాలుగా మూడేళ్లలో డ్యామ్‌ను నింపుతామని వివరించారు.
రిజర్వాయరును పూర్తిగా నీటితో నింపే నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. ఆలోపు కేంద్రం నుంచి డబ్బులు వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
కేంద్రం నుంచి ఆ స్థాయిలో డబ్బులు రాకపోతే .. రిజర్వాయరులో నీటిని నింపడం అయినా అపుతామన్నారు జగన్.
అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు.
కేంద్రం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిధులు తీసుకుస్తామన్నారు జగన్. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 41.15 లెవల్ వరకు అందరికీ పీడీఎఫ్‌లు చెల్లిస్తామన్నారు.
ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి.. నిర్వాసిత కాలనీలకు తరలిస్తామని తెలిపారు.
వెయ్యో, 2వేలకోట్లో అయితే ఇంతగా ఆలోచన చేయకోపోయేవాళ్లమని.. ఇది రూ. 20 వేల కోట్లకు సంబంధించి విషయంగా చెప్పారు జగన్.
అందుకే కేంద్రం సహాయం కూడా తప్పనిసరి అని అన్నారు. దీనికి ప్రత్యామ్నాయం కూడా లేదన్నారు.
కొందరు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ముంపు మండలాలైన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఏటపాక కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయమని విజ్ఞప్తి చేశారు. దానికి కూడా ఆమోదం తెలుపుతున్నానన్నారు.
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన