Nara Lokesh Arrested, Pics: నారా లోకేశ్ అరెస్టు.. రమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత, పలువురు నేతల్ని బలవంతంగా..
దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీటెక్ విద్యార్థిని రమ్యను ఆదివారం తాడేపల్లిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే.
పరామర్శించిన అనంతరం గుంటూరులోని రమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు అక్కడికి వచ్చారు. రమ్య తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
ఈ క్రమంలో నారా లోకేశ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ హాయాంలో సాధారణ మహిళలకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు.
ఇటీవలే వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తనకు ప్రాణ గండం ఉందని చెప్పడాన్ని లోకేశ్ ప్రస్తావించారు.
సీఎం జగన్ చెల్లెలైన సునీతా రెడ్డికే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళలకు రాష్ట్రంలో భద్రత ఎక్కడుందని నిలదీశారు.
రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో నారా లోకేశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు స్వాతంత్య్రం పోవడం బాధాకరమని లోకేశ్ అన్నారు.
గన్ కంటే ముందు జగన్ వస్తాడని బిల్డప్ ఇచ్చారని.. ఇప్పుడు జగన్ రావడం లేదు.. గన్ను రావడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.
రమ్య హత్య జరిగిన 12 గంటల తరువాత సీఎం జగన్ ట్వీట్ పెట్టారంటే మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుందని లోకేశ్ అన్నారు.
మహిళల్ని హత్య చేసే హక్కెవరిచ్చారని హోం మంత్రి అంటున్నారని.. ఆ మాట విన్నాక నవ్వాలో, ఏడవాలో తనకు అర్ధం కావడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.
‘‘మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి గారే ఇచ్చారమ్మా సుచరిత గారు...’’ అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
‘‘దిశ చట్టం అన్నారు.. 21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు? ఇప్పటి వరకూ ఎంత మందికి శిక్ష పడిందో చెప్పే ధైర్యం ఉందా? దిశ చట్టం, దిశ యాప్ అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు.
‘‘దిశ చట్టంపై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది. మహిళల రక్షణ పట్ల వీళ్లకున్న చిత్తశుద్ధి అది.’’ అని లోకేశ్ విమర్శించారు.