In Pics: పెడన, మచిలీపట్నంలో వారాహి విజయభేరి - రెట్టించిన ఉత్సాహంలో జనం
మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో వారాహి విజయ భేరి బహిరంగ సభ జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల ప్రచారంలో సంయుక్తంగా పాల్గొన్నారు.
భీమవరం నియోజకవర్గం నుంచి తాను పిఠాపురానికి వచ్చి పోటీ చేస్తుండడంపై సీఎం జగన్ బాధపడుతున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
మరి అంత మంది వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
జగన్‌లో రోజు రోజుకు ఫ్రస్టేషన్ పెరుగుతోందని.. అందుకే భీమవరంలో తనపై విమర్శలు చేశారని అన్నారు.
కూటమిలోని పార్టీల మధ్య కొట్లాటలు పెట్టడం కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని పవన్ అన్నారు.
ఏపీలో బలమైన ప్రభుత్వం ఉన్నపుడే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు.
మద్యనిషేదం చేస్తానని చెప్పి సారాను, కల్తీ మద్యాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రవహింపజేస్తున్నారని పవన్ విమర్శించారు.
గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు జగన్ ఆడారని.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల ముందు చేసే ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మబోరని అన్నారు.
తనపై, పవన్‌పై దాడి జరిగితే రాయి కనిపించిందని.. మరి జగన్‌పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు.
ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నా ఏం చేయలేకపోయాననే బాధతో బాలశౌరి బయటికొచ్చి జనసేనలో చేరారని అన్నారు.