Eesha Rebba: ఈషా రెబ్బా శ్రీరామ నవమి లుక్ - ట్రెడిషనల్ వేర్‌లో ఫిదా చేసిన బ్యూటీ
Eesha Rebba Photos: నటి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందంలో, నటనలో స్టార్ హీరోయిన్లకు తీసిపోదు.
కానీ ఎందుకో ఆమెకు లక్క్ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. అదీ కంటిన్యూ చేయలేకపోయింది.
మొదట మోడలింగ్ చేస్తూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసిన ఆమె 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. పరంగా మంచి మార్క్స్ కొట్టేసింది. కానీ ఆ తర్వాత హీరోయిన్‌గా రాణించలేకపోయింది.
సహానటి, గెస్ట్ ఎప్పియరెన్స్ రోల్స్‌కే పరిమితం అయ్యింది. వెండితెరపై పెద్దగ ఆమె సందడి కరువైన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈషా తన శ్రీరామ నవమి లుక్ షేర్ చేసింది. ఎథినిక్ వేర్‌లో ఈ భామ సిల్వర్ స్టంట్స్ ధరించి సంప్రదాయ లుక్‌లో మెరిసింది.
ప్రస్తుతం ఈషా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా ట్రెడిషనల్ లుక్‌కి అంతా ఫిదా అవుతున్నారు.