Nara Lokesh: 'నాకెందుకు స్పెషల్ - అలాంటివేమీ వద్దు' - మంత్రి నారా లోకేశ్ సింప్లిసిటీ, బాధ్యతల స్వీకరణ
ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సచివాలయంలోకి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు నారా లోకేశ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు లోకేశ్ తన సింప్లిసిటీ చాటుకున్నారు. తన చైర్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవర్లను ఆయనే తొలగించారు.
అందరిలానే తాను కూడా అంటూ తన చైర్‌కు ఏర్పాటు చేసిన కవర్లను తొలగించారు. తన ఛాంబర్లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చెయ్యొద్దని అధికారులకు సూచించారు.
చైర్‌కు ఉన్న కవర్లను తొలగించి అక్కడి సిబ్బందికి అందించారు. ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ అవసరం లేదని చెప్పారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి నారా లోకేశ్.. మెగా డీఎస్సీ విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసి కేబినెట్‌కు పంపారు. అనంతరం మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేశ్‌కు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా లోకేశ్‌కు మహిళా మంత్రులు విషెష్ చెప్పారు. ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి సైతం ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం టీడీపీ నేతలు, శ్రేణులు నారా లోకేశ్‌కు భగత్ సింగ్ చిత్రపటాన్ని బహూకరించారు.