Andhra Pradesh Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి మొదటి సమావేశం ఫొటోలు చూశారా?- పవన్ ఎక్కడ కూర్చున్నారంటే?

వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి మంత్రిమండలి సమావేశం ఇది.

తొలి మంత్రిమండలి భేటీలో ఎన్నికల హామీలు, సూపర్ 6 పథకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన అప్పులపై కూడా తొలి కేబినెట్ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది.
25 మంది మంత్రులతో ఈ మధ్యే కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ముఖ్యమంత్రిగా తొలిరోజు చంద్రబాబు చేసిన ఐదు సంతకాలైన మెగా డీఎస్సీ, నాలుగువేలకు పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సెస్, అన్న క్యాంటీన్ల ఫైళ్లను ఆమోదించనుందీ మంత్రివర్గం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పు 14 లక్షల కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసిన ఆర్థిక శాఖ ఆ వివరాలను కేబినెట్ ముందు ఉంచింది.
అప్పులు, ఆర్థిక కష్టాలను అధిగమించి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు రూపొందించాల్సిన బడ్జెట్‌పై కూడా కేబినెట్లో చర్చ జరిగుతోంది.
కేంద్రం నుంచి వచ్చే నిధులపై కూడా ఆయా శాఖలు దుృష్టిపెట్టాలని చంద్రబాబు సూచనలు చేయనున్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు ఉండాలని హితవు పలకనున్నారు.
తొలి కేబినెట్ మీటింగ్‌లో చంద్రబాబు సీఎం స్థానంలో కూర్చుంటే తర్వాత అధికారులు కూర్చున్నారు. తర్వాత మంత్రుల్లో చంద్రబాబుకు ఎడమవైపు కూర్చుంటే... కుడి వపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూర్చున్నారు.
16 వేల పోస్టులతో వేసిన మెగా డీఎస్సీతోపాటు తొలి సంతకం చేసిన ఇతర నాలుగు పథకాలను కేనెనెట్ ఆమోద ముద్ర వేసింది.
మంత్రులుగా చేపట్టాల్సిన అంశాలపై కూడా సహచరులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మంత్రిమండలి సమావేశాలకు హాజరవుతున్న వేళ రిజిస్ట్రేషన్‌లో వివరాలు నమోుద చేసి సంతకం పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మంత్రిమండలి సమావేశాలకు హాజరవుతున్న వేళ రిజిస్ట్రేషన్‌లో వివరాలు నమోుద చేసి సంతకం పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్