In Pics: తమిళనాడులోనూ లోకేశ్‌కు క్రేజ్, అన్నామలైతో ప్రచారం - ఫోటోలు
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా సింహంలా పని చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅన్నామలై ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ విప్లవం సృష్టిస్తున్నారని అన్నారు.
కోయంబత్తూరు పార్లమెంటు స్థానంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అన్నామలైకి మద్దతుగా నారా లోకేష్ ప్రచారం చేశారు.
కోయంబత్తూరులోని బీలమేడు ప్రాంతంలో నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు.
అప్పట్లో కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా అన్నామలై సింహంలా నిలిచారని లోకేశ్ అన్నారు.
ఇప్పుడు తమిళనాడులో రాజకీయ విప్లవం తీసుకొస్తున్నారని అన్నారు.
కోయంబత్తూరు అభివృద్ధికి మిలటరీ లాజిస్టిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌తో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ తీసుకొచ్చారని లోకేశ్ గుర్తు చేశారు.
కోయంబత్తూరులో పోటీ చేస్తున్న అన్నామలైని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.
అన్నామలై నేరుగా ప్రధాని మోదీతో మాట్లాడి కోయంబత్తూరును మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని లోకేష్ అన్నారు.
టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం.. అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్ ను ఆహ్వానించింది.
కోయంబత్తూరులో తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన వారు ఉన్నారు.
ఆ ప్రాంతాల్లో నారా లోకేశ్ ప్రచారం చేయడం ద్వారా వారిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది.
అదీకాక కోయంబత్తూర్ సీటును ఎన్డీయే కూటమి చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఇప్పటికే అన్నామలై తరపున దేశ వ్యాప్తంగా ఉన్న పేరెన్నికగన్న బీజేపీ నేతలు, ఎన్డీయే పక్షాల లీడర్లు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఆ క్రమంలోనే లోకేశ్ కూడా అన్నామలైకు మద్దతుగా ఏప్రిల్ 11, 12 తేదీల్లో కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏప్రిల్ 11న రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో నారా లోకేశ్ అన్నామలైతో కలిసి పాల్గొన్నారు.
ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో అక్కడి తెలుగు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశం అయ్యారు.