Maoist RK : కుటుంబ సభ్యులతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చివరి ఫొటోలు
కుటుంబ సభ్యులతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చివరి ఫొటోలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో అక్టోబర్ 14న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించాం. ఆర్కే మరణం పార్టీకి తీరని లోటు అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలోని పల్నాడులో 1958లో హరగోపాల్ జన్మించారు. హరగోపాల్ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత తండ్రితో కలసి కొంతకాలం టీచర్ గా పనిచేశారు. 1978లో విప్లవ రాజకీయాలపట్ల ఆకర్షితులై భాకపా (మాలె) (పీపుల్స్ వార్) లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన హరగోపాల్ 2001లో జరిగిన పీపుల్స్ వార్ 9వ కాంగ్రెసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా మారారు.
ఆర్కే మరణ వార్త విని.. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని ఆరోపించారామె. ఆర్కే.. ప్రజల కోసం పోరాడిన గొప్ప యోధుడనీ..తన ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. అర్కే అమర్ రహే అంటూ కన్నీటితో నినాదాలు చేశారు.
కుటుంబ సభ్యులతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చివరి ఫొటోలు
కుటుంబ సభ్యులతో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చివరి ఫొటోలు