Tirumala: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం
కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.
కరోనా దృష్ట్యా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం చక్రస్నానం. స్వామికి, ఉభయదేవేరులకు, చక్రాత్తాళ్వార్లకు స్నపన తిరుమాంజనం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేక కైంకర్యంతో స్వామి ప్రసన్నుడవుతాడు.
శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కుమారి పాల్గొన్నారు.
చక్రస్నానం ముందుగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదపండితులు
స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి స్నానం చేయిస్తారు. స్వామి వారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించాక స్వామివారిని ఆనంద నిలయానికి తరలించారు.
చక్రస్నానాన్ని వీక్షిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు
కన్నుల పండుగగా చక్రస్నానం ఘట్టం